హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ బెటాలియన్‌లో గాంధీ జయంతి వేడుకలు

KDP: సిద్దవటం (M) భాకరాపేటలోని 11వ పోలీస్ బెటాలియన్‌లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ కె. ఆనందరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమానికి అసిస్టెంట్ కమాండెంట్ పి. రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస మార్గాల్లో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన ఆయన త్యాగాలను గుర్తుచేశారు.