హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైడే నిబంధనల ఉల్లంఘన

SKLM: టెక్కలిలో గాంధీ జయంతి సందర్భంగా డ్రైడే నిబంధనలను ఉల్లంఘిస్తూ మాంసం విక్రయాలు, బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయని బీజేపీ నాయకుడు చిట్టిబారికి లింగరాజు ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల అమలులో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యల తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.