హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సభకు 920 ఆర్టీసీ బస్సులు

అన్నమయ్య: బీకేపల్లెలో ఇవాళ జరగనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి 920 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా అధికారి శశిభూషణ్ తెలిపారు. ప్రతి గ్రామం నుంచి బస్సులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.