హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ప్రశాంతం ఎస్ఎంసీ ఎన్నికలు

కర్నూలు జిల్లాలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ తెలిపారు. జిల్లాలోని 1,442 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు గాను 1,391 పాఠశాలల్లో కమిటీలు ఏర్పడ్డాయని చెప్పారు. 50 శాతం కోరం లేకపోవడంతో 51 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించలేకపోయామని, ఆయా పాఠశాలల్లో అక్టోబర్ 3న ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.