ASR: అరకులోయ మండలం మొర్రిగూడ గ్రామంలో వారం రోజులుగా కొళాయిల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సుమారు 106 కుటుంబాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దూరంగా ఉన్న పంట పొలాల వద్ద నీటి వనరుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. మహిళలు, వృద్ధులు నీటి కోసం అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మొర్రిగూడలో తాగునీటి కష్టాలు


