హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఆంధ్ర పురస్కారానికి ఎంపికైన ఎలమంచిలి

AKP: ‘స్వచ్ఛ ఆంధ్ర’ పురస్కారానికి ఎలమంచిలి మున్సిపాలిటీ ఎంపికైంది. 50 వేలలోపు జనాభా ఉన్న పట్టణాల్లో రెండో స్థానంలో నిలిచినట్లు కమిషనర్‌ ప్రసాదరాజు తెలిపారు. ఇంటింటా చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీ వంటి అంశాల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కమిషనర్ పురస్కారం అందుకోనున్నారు.