హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీజీ ఆశయాలను ఆచరించాలి: మంత్రి పయ్యావుల

ATP: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ఆచరిస్తూ సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.