హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ తుది ఓటరు జాబితా విడుదల

AKP: మున్సిపాలిటీ కమిషనర్ జంపా సరేంద్ర తుది ఓటరు జాబితాలను విడుదల చేశారు. ఇందులో భాగంగా, 40 వార్డుల్లో 49,099 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 23,317, మహిళలు 25,778, ఇతరులు నలుగురు ఉన్నారు. బీసీ ఓటర్లు 36,326 మంది ఉండగా.. వీరిలో పురుషులు 17,194, మహిళలు 19,124, ఇతరులు నలుగురు ఉన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలన్నీ ఈ జాబితా ఆధారంగానే నిర్వహించబడతాయని తెలిపారు.