శ్రీకాకుళం: నగరం పరిధిలోని అరసవిల్లి ఆలయంలో సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు నేడూ కూడా తాకలేదు. ఆదిత్యునికి కిరణ స్పర్శ తాకే అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు రెండో రోజూ తీవ్ర నిరాశ ఎదురైంది. మబ్బులు కమ్ముకోవడంతో ప్రభాత భానుడి సూర్య కిరణాలు ఆలయంలోకి ప్రసరించలేదని అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడూ మూల విరాట్‌ను తాకని కిరణాలు


