హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి రోజు 94.62 శాతం పింఛన్ల పంపిణీ 

అన్నమయ్య జిల్లాలో 94.62 శాతం గురువారం పింఛన్ల పంపిణీ జరిగిందని DRDA పీడీ నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 1,86,186 మంది అర్హులుకాగా నిన్న రాత్రి వరకు 1,76,177 మంది లబ్దిదారులకు రూ. 76,30,09,500 నగదు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో మూడో స్థానంలో ఉన్నామన్నారు. జిల్లాలో పుంగనూరు అర్బన్ పింఛన్ల పంపిణీలో 96.42 శాతంతో మొదటి స్థానంలో ఉందన్నారు.