హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మాంసం విక్రయం బంద్

NDL: గాంధీ జయంతిని పురస్కరించుకొని నంద్యాలలో నేడు మాంసం విక్రయించరాదని పురపాలిక కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. జంతు వధ చేయడం నిషేధం అన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలో మాంసాహారాన్ని వండరాదని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.