కృష్ణా: కాలువలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఘటన పెడన (M) కుడూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో నిన్న సాయంత్రం జరిగింది. విజయవాడకు చెందిన బల్ల మధుసూదన్‌రావు (34) కొత్తూరులోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. సాయంత్రం సమయంలో స్నానం చేసేందుకు లజ్జబండ కాలువలోకి దిగగా అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో కొట్టుకుపోయిన యువకుడు


