PLD: ఉల్లిపాయల ధరలు పెరగడంతో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయల విక్రయానికి ఏర్పాట్లు చేసింది. సత్తెనపల్లి, చిలకలూరిపేట రైతుబజార్లలో కిలో రూ.35కే ఉల్లిపాయలు విక్రయించనున్నారు. ఇప్పటికే కిలో ధర రూ.70–75 వరకు ఉండటంతో ప్రజలకు రాయితీ ఉల్లిపాయలు అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయితీపై ఉల్లిపాయలు


