హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ డాగ్ కానైన్ 'క్యాండీ' మృతి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో పేలుడు పదార్థాల గుర్తింపు విభాగంలో సేవలందించిన 'క్యాండీ' మృతి చెందింది. వీఐపీ, వీవీఐపీ కాన్వాయ్‌ల యాంటీ సాబోటేజ్ తనిఖీల్లో క్యాండీ కీలకంగా సేవలందించింది. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం తదితర ముఖ్య కార్యక్రమాల్లో భద్రతా విధులు నిర్వహించింది. క్యాండీ మృతికి జిల్లా SP ఎల్.సుబ్బరాయుడుతో పాటు పోలీసు అధికారులు నివాళులర్పించారు.