హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తపాలా అదాలత్‌కు ఫిర్యాదులు ఆహ్వానం

VSP: తపాలా అదాలత్ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ అసిస్టెంట్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. విశాఖ పోస్టల్ రీజియన్ పరిధిలో ఫిర్యాదుల పరిష్కారానికి ఈనెల 14న ఉదయం 11 గంటలకు పీజీ కార్యాలయంలో అదాలత్ నిర్వహిస్తామన్నారు. ఫిర్యాదులను 10వ తేదీలోగా పోస్ట్ మాస్టర్ కార్యాలయం, విశాఖ-530017 చిరునామాకు పంపాలన్నారు.