హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

ప్రకాశం: కొమరోలు మండలంలో గురువారం రాత్రి జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురు గాయపడ్డారు. నడిచి వెళుతున్న వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.