హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీనీకి పెరిగిన డిమాండ్.. రైతులకు ఊరట

KDP: దసరా పండగ నేపథ్యంలో చీనీ పండ్లకు డిమాండ్ పెరగడంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకోవడంతో నెల రోజుల క్రితం టన్ను రూ.10 వేలుగా ఉన్న ధర ప్రస్తుతం రూ.30 వేలకు చేరింది. కాయల నాణ్యత, పరిమాణం, రంగును బట్టి వ్యాపారులు ధరలు చెల్లిస్తున్నారు. లింగాల, సింహాద్రిపురం, తొండూరు మండలాల్లో సుమారు 65 వేల ఎకరాల్లో చీనీ సాగవుతోంది.