హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం-విశాఖ మధ్య ప్రత్యేక మెమూ

VSP: గాంధీ జయంతి, వారాంతపు సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-పార్వతీపురం మధ్య ప్రత్యేక మెమూ(07268/67) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి 12.25కు పార్వతీపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 12.35కు బయలుదేరి సా. 4 గంటలకు విశాఖ చేరుతుంది. అక్టోబర్ 2 నుంచి 4 వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.