హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రగ్బీ పోటీల్లో సత్తా చాటిన పిఠాపురం విద్యార్థులు

కాకినాడ: పిఠాపురం విద్యార్థులు రగ్బీ క్రీడలో విశేష ప్రతిభచాటారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా స్థాయి రగ్బీ ఛాంపియన్‌షిప్‌లో రాణించిన ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-19లో జి.శివ నాగ దుర్గ, జి. నవీన్, అండర్-18లో తాతాజీ, అండర్-14లో జి.నిఖిల్, బాలికల విభాగంలో భావన, విద్యా స్వరూప ఎంపికయ్యారు.