కోనసీమ: పారిశుధ్య నిర్వహణలో ప్రతిభ కనబరిచిన రావులపాలెం గ్రామపంచాయతీ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర అవార్డుకు ఎంపికైంది. గాంధీ జయంతి సందర్భంగా అమరావతిలో CM చేతుల మీదుగా ప్రతినిధులు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఇంటింటా చెత్త సేకరణ, చెత్త నుంచి సంపద తయారీ, తడి-పొడి చెత్తపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రావులపాలెం పంచాయతీకి స్వచ్ఛాంధ్ర అవార్డు


