SKLM: టెక్కలి మండలం జగతిమెట్ట లేఅవుట్‌కు చెందిన నెయ్యిల చాందిని(18) గురువారం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉన్న ఆమెను తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఈనెల 28న ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వీఆర్వో శ్యామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు
ఆంధ్రప్రదేశ్
మనస్తాపానికి గురై యువతి మృతి


