KDP: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3న నిర్వహించాల్సిన కడప డివిజనల్ స్థాయి యోగా,చెస్,వాలీబాల్ క్రీడల ఎంపికలను వాయిదా వేసినట్లు డివిజనల్ కోఆర్డినేటర్ షేక్ సాజిద్ తెలిపారు. వివిధ కారణాలతో నిర్ణయించిన తేదీన ఎంపికలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఎంపికలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డివిజనల్ స్థాయి క్రీడా ఎంపికలు వాయిదా


