హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధుల హక్కులపై న్యాయ అవగాహన

W.G: అంతర్జాతీయ వృద్ధుల సంక్షేమ దినోత్సవం సందర్భంగా నరసాపురంలో గురువారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ. వాసంతి హాజరై వృద్ధుల హక్కులు, తల్లిదండ్రుల సంక్షేమ చట్టం-2007పై అవగాహన కల్పించారు. పిల్లల నుంచి తల్లిదండ్రులు మనోవర్తి పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జి. గంగరాజు, ఆర్డీవో పాల్గొన్నారు.