ASR: ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపాడ గ్రామంలో స్వచ్ఛత హీ సేవలో భాగంగా ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో ధర్మారావు గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు చిన్ని పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొండపాడలో స్వచ్ఛత కార్యక్రమం


