ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా, ఎన్ఎస్ఎస్, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా, క్యాన్సర్ బాధితులకు రక్తం ఎంతో అవసరమని వైస్ ప్రిన్సిపల్ డా.శ్రీనివాస పాత్రుడు తెలిపారు. రక్తదానంపై అపోహలు వీడి, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రక్తదానంపై విద్యార్థులకు అవగాహన


