హైదరాబాద్: 28°C
క్రీడలు

'టైమ్ 100'లో వైభవ్ సూర్యవంశీకి చోటు

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 100 మంది రైజింగ్ స్టార్ల జాబితాలో అతడు చోటు సంపాదించాడు. మొత్తం ఏడుగురు క్రీడాకారులు ఎంపికవగా భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు వైభవ్ కావడం గమనార్హం. కాగా, 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి వైభవ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.