హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు'

VZM: భోగాపురం మండలంలో బొటానిక్ ఇండస్ట్రీస్‌ను గురువారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. భోగాపురంలో ఇలాంటి పరిశ్రమల స్థాపన వల్ల స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.