హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛత కార్యక్రమం

విజయనగరం రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛత కార్యక్రమాన్ని విశాఖపట్నం డివిజన్ అదనపు రైల్వే మేనేజర్ కె.రామారావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని చీపుర్లతో ఊడ్చారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేనేజర్ సూచించారు. పరిశుభ్రతలో రైల్వే అధికారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.