హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీలో 40 వార్డుల తుది జాబితాల ప్రదర్శన

CTR: నగరి పురపాలక సంఘ పరిధిలో సాధారణ ఎన్నికలకు సంబంధించి 40 వార్డుల ఎస్టీ, ఎస్సీ, మహిళలు, బీసీ వర్గాలకు సంబంధించిన వార్డుల తుది జాబితాలను గురువారం మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించినట్లు కమిషనర్ బి. బాలాజీ నాయక్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన సెప్టెంబర్ 22వ తేదీ సర్క్యులర్ ప్రకారం ఈ జాబితాలను అక్టోబర్ 1న ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.