హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెట్ నుంచి మినహాయింపు కల్పించాలి: ఆపస్

CTR: ఇన్ సర్వీసు టీచర్లకు ప్రభుత్వం టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా సహ అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. సదుం మండలంలోని పలు పాఠశాలల్లో గురువారం ఆయన పర్యటించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి అపస్ ముందంజలో ఉంటుందని చెప్పారు. టీచర్ల సాంకేతిక, ఆర్ధిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.