హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

SKLM: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాబురావు అన్నారు. ఎచ్చెర్ల టీడీపీ ఇంఛార్జ్ లంక శ్యామలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.