హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెవెన్యూ సేవలను వేగవంతం చేయాలి'

VZM: రెవెన్యూ సేవలు, పాస్‌ పుస్తకాల పంపిణీ, అగ్రిస్టాక్‌, భూ రీ-సర్వే పనులను వేగవంతం చేయాలని జేసీ ఎస్‌.సేధు మాధవన్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌ నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమీక్షలో నవంబర్‌ పాస్‌ పుస్తకాల పంపిణీపై చర్చించారు. 101 గ్రామాలకు 48 మాత్రమే వెబ్‌ల్యాండ్‌కు పోర్ట్‌ కాగా, 4,991 ఖాతాల ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉందన్నారు.