హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి..

SRPT: బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, జిల్లా కమిటీ ఇన్‌చార్జి రామకృష్ణ యాదవ్ అన్నారు. కొక్కిరేణి గ్రామానికి చెందిన రెడ్డబోయిన సురేష్ యాదవ్‌ను బీసీ సేన మండల అధ్యక్షుడిగా నియమించి, నియామక పత్రాన్ని అందజేశారు. గ్రామగ్రామాన కమిటీలు ఏర్పాటు చేసి బీసీల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.