హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శబ్ద కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల చర్యలు

WGL: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్‌లపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు గురువారం చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన డబుల్, అధిక శబ్దం చేసే సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. శబ్ద కాలుష్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.