హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

SRCL: జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ మర్రిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్‌ వంటగదిని తనిఖీ చేసి ఆహార పదార్థాల నిల్వ, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు.