హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్‌లో చైల్డ్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

KKD: సామర్లకోట రైల్వే స్టేషన్‌లో చైల్డ్ హెల్ప్ డెస్క్‌ను జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.హెచ్. లక్ష్మి గురువారం ప్రారంభించారు. బాలల రక్షణ కోసం GRP, RPF సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ఆపదలో ఉన్న పిల్లలు 1098కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.