హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: DMHO

MHBD: జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని DMHO డాక్టర్‌ బి. రవి రాథోడ్‌ సూచించారు. గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గుర్తించిన 64 మంది బాధితులకు ఎండీటీ మందులు సకాలంలో అందించాలని ఆదేశించారు. కొత్త కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు.