ASF: మహిళలు, చిన్నారుల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత అని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ తెలిపారు. సెప్టెంబర్‌లో షీ టీం ఆధ్వర్యంలో 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 76 హాట్‌స్పాట్‌లలో నిఘా పెట్టి 7 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మహిళలు, యువతులు వేధింపులకు గురైతే షీ టీంను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
మహిళల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత: ఎస్పీ


