హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లబ్ధిదారులకు సకాలంలో రేషన్ అందించాలి'

PPM: లబ్ధిదారులకు సకాలంలో రేషన్ సరుకులు అందాలని, లేదంటే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి తెలిపారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ఎటువంటి జాప్యం తగదని అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఛాంబరులో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.