హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి'

PLD: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ అన్నారు. గురువారం పల్నాడు కలెక్టరేట్‌లో పోష్‌ చట్టం–2013పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.