SKLM: పొందూరు మండలం ఎస్.జి.ఎన్.పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జాతిపిత గాంధీ విగ్రహం చుట్టూ తుప్పలు పెరిగి నిరాదరణకు గురవుతోంది. నిత్యం జాతీయ గీతం పాడే పవిత్ర ప్రాంగణంలో బాపూజీ విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల పరిసరాలు, జాతీయ నేతల విగ్రహాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతిపిత విగ్రహానికి అవమానం


