హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిపల్లి, లక్ష్మాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

NZB: మేడిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్‌లు లాకావత్ శ్రావణిరవి, ఉమాసంజీవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.