హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్ జిల్లా పోటీలకు అన్నదమ్ములు ఎంపిక

MBNR: అడ్డాకల్ మండలం తిమ్మాయపల్లి తండాకు చెందిన నీల్య, అంజమ్మ దంపతుల కుమారులు జే. పాండు, జే. సురేష్ 52వ బాలుర జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ జట్టుకు పాండు కెప్టెన్‌గా, సురేష్ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నెల 2 నుంచి 5 వరకు వేములవాడలో జరిగే పోటీల్లో వారు పాల్గొంటారు.