హైదరాబాద్: 28°C
తెలంగాణ

చారిత్రాత్మక కట్టడాలు కూల్చివేత

GDWL: ఉండవెల్లి మండలం బస్వాపురంలో నిజాం కాలం నాటి జైలు కట్టడాలను జేసీబీతో తొలగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి కట్టడంలోని రాళ్లను తరలిస్తున్నారని ఆరోపిస్తూ పనులను అడ్డుకున్నారు. ఎలాంటి గ్రామసభ తీర్మానం లేకుండానే తొలగింపులు జరిగాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు.