హైదరాబాద్: 28°C
వ్యాపారం

ప్రీపెయిడ్‌ ప్లాన్లపై రూ.లక్ష బీమా

తన వినియోగదారులకు BSNL శుభవార్త చెప్పింది. తన ప్రీపెయిడ్ ప్లాన్లపై ఉచిత బీమా సదుపాయం, సైబర్ ఫ్రాడ్ కవరేజీని అందించనున్నట్లు తెలిపింది. వీటికోసం యూజర్లు స్పెషల్ టారిఫ్ వోచర్లు(STV) 202, STV 2449 ప్రీపెయిడ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని రీఛార్జ్ చేసుకున్న వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.లక్ష వరకు బీమా, అలాగే సైబర్ మోసానికి గురైతే రూ.10 వేల వరకు కవరేజీ వస్తుంది.