జీఎస్టీ వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్లు దాటాయి. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 14.7 శాతం పెరిగి రూ.2,03,521 కోట్లు వచ్చాయి. గతేడాది ఇదే నెలలో రూ.1,77,173 కోట్లుగా రాగా ఈ సారి గణనీయంగా వసూళ్లు పెరిగాయి. గత నెలలో వచ్చి వసూళ్లలో కేంద్ర జీఎస్టీ ద్వారా రూ.37,762 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ ద్వారా రూ.45,363 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
వ్యాపారం
సెప్టెంబర్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు


