హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ భారత్.

పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో స్టేషన్ సూపరింటెండెంట్ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ప్రయాణికులు, ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలతో ఆరోగ్యం అన్నారు.