హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

WNP: మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు గుంటుపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండీ రహమతుల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్, వీర్లదిన్నె శీను తదితరులు పాల్గొన్నారు.