BHNG: బీబీనగర్ మండలం పడమటిసోమారం గ్రామంలో రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాటలో 21 కిలోల లడ్డూ రూ.2.05 లక్షల ధర పలికింది. మండలంలోనే అత్యధిక ధరగా నమోదైన ఈ లడ్డూను ఫకీర్ సుధాకర్ రెడ్డి వేలంలో కొనుగోలు చేశారు. అలాగే శాలువ, కలశం, పండ్లను రూ.60 వేలతో ఎలిమినేటి మధురెడ్డి కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. ఈ వివరాలను కమిటీ సభ్యులు వెల్లడించారు.
తెలంగాణ
మండలంలోనే అధిక ధర పలికిన గణేష్ లడ్డు


