హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్

WNP: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా గ్రామాల వారీగా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎన్నికల్లో ప్రతిబింబించేలా పనిచేయాలని అన్నారు.